: బీజేపీతో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పెట్టుకోవడం అసాధ్యం: ఒమర్ అబ్దుల్లా
గత యూపీఏ కూటమి నుంచి వైదొలగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, ఈసారి బీజేపీతో చేతులు కలపబోతోందంటూ వస్తున్న వార్తలను జమ్ము, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. కమలదళంతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యమన్నారు. "ఇలాంటి విషయాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ ఇళ్లలో ఇలాంటి వార్తలను సృష్టిస్తారు. దానికి నేనేం చేయగలను? మా వైపు నుంచి అలాంటి ఆలోచనలు లేవు. మేమెలాంటి సంకేతాలను కూడా ఇవ్వలేదు" అని ఒమర్ స్పష్టం చేశారు. కొంతమంది విలేకరులు స్టోరీలు తయారుచేసి, సోర్స్ పేర్లు చెప్పకుండా, విశ్వసనీయ సమాచారం అని చెబుతారని, అలాంటి విషయాలు తనకు బాగా తెలుసన్నారు ఒమర్.