: కాలం చెల్లిన మిగ్ విమానాల స్థానంలో 'తేజస్' విమానాలు
గత కొన్నేళ్లుగా మిగ్ విమానాలు నేలకూలిన ఘటనలు ఎన్నో. వాటి సాంకేతికతకు కాలం చెల్లిందని, అవి లోపభూయిష్టమైన విమానాలని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇకపై, ఈ రష్యా తయారీ యుద్ధవిమానాల వినియోగాన్ని తగ్గించుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది. వాటిస్థానాన్ని దేశీయంగా రూపొందించిన 'తేజస్' లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో భర్తీ చేయాలని నిర్ణయించామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. త్వరలోనే 20-30 విమానాలను వాయుసేనకు అప్పగిస్తామని చెప్పారు. అటు, ఫ్రెంచ్ తయారీ రఫేల్ జెట్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఒప్పందం కుదిరితే 126 అత్యాధునికమైన రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరతాయి.