: జర్మన్, సంస్కృతం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు: సుప్రీంకు కేంద్రం
విద్యార్థి అభిరుచి మేరకు జర్మన్ లేదా సంస్కృతం రెండింటిలో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు జర్మన్ భాష తొలగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో సంస్కృత పరీక్ష ఉండదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం వివరణను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో, పిల్లలపై భారం పడకుండా పరిష్కారం సూచించారని న్యాయస్థానం పేర్కొంది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.