: ఒకవైపు రాహుల్ మౌన దీక్ష... మరోవైపు బీజేపీ భజన!
పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజకీయ నేతలు నిరసన తెలపాలంటే గాంధీ విగ్రహం ముందే కూర్చుంటారని అందరికీ తెలుసు. మోదీ క్యాబినెట్లోని మంత్రి సాధ్వి నిరంజన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు గాంధీ విగ్రహం ముందు నోటికి నల్లటి వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు. కాసేపటికి సభ వాయిదా పడగా, ఆ వెంటనే బీజేపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందుకు వచ్చి భజన కచేరీ ప్రారంభించారు. "రఘుపతి రాఘవ రాజారాం" అంటూ భజనలు చేశారు. కారణం ఏంటని అడిగితే, విపక్షాలు సభను సజావుగా సాగనివ్వటం లేదని, అందుకు నిరసనగా ఈ భజన చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.