: త్వరలో ఏపీలో కొత్తగా 40 సహకార బ్యాంకు శాఖలు
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 13 జిల్లాల్లో నూతనంగా 40 సహకార బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయబోతున్నట్టు ఆప్కాబ్ సీనియర్ అధికారి పాటిబండ్ల నాగేశ్వరరావు తెలిపారు. వాటితో పాటే రాజధాని ప్రాంతంలో సహకార బ్యాంకు ప్రధాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లా లక్ష్మీపురం, బాపట్ల, కొత్తపేట, నరసరావుపేట, మంగళగిరి, తెనాలిలో తమ బ్యాంకు శాఖల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టినట్టు వెల్లడించారు.