: జనవరి 6,7 తేదీల్లో జగన్ నిరాహార దీక్ష
సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బాబు సర్కారు మోసపూరిత విధానాలపై తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులో చంద్రబాబు మెడలు వంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.