: తెలంగాణలో హోంగార్డుల వేతనాలు పెంపు


తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. హోంగార్డుల వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డుల జీతాలు రూ.9వేల నుంచి రూ.12 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈనెల 6న హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, పరేడ్ అలవెన్స్ రూ.28 నుంచి వంద రూపాయలు పెంచామని చెప్పారు. జంటనగరాల పరిధిలోని హోంగార్డులకు బస్ పాస్ లు కూడా ఇస్తామన్నారు. ఇక, హోంగార్డులకు ఆరోగ్య బీమా, ఏడాదికి రెండు యూనిఫాంలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. పెంచిన వేతనాల వల్ల రాష్ట్రంలోని 16వేల హోంగార్డులకు లబ్ధి చేకూరుతుంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News