: సంగారెడ్డి సమీపంలో సంచరిస్తున్న చిరుత
సంగారెడ్డి మండలం తాళ్లపల్లి వద్ద ఓ చిరుతపులి కుటుంబం సంచరిస్తోంది. దీంతో, ఆ గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి సమీపంలో చిరుత, దాని రెండు పిల్లలు తిరగటాన్ని నేటి ఉదయం గ్రామస్థులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఏ క్షణం తమ గ్రామంపై దాడి చేస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.