: ఐ ఫోన్ అని కొంటే బండరాయి వెక్కిరించింది!


ఐ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నామంటూ చివరకు బండరాళ్లను అంటగట్టి మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌కు చెందిన అబ్బాస్ అలీ (31), మెహందీ హుస్సేన్ (35)లు ఒక స్కూటర్ పై తిరుగుతూ, ఐ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు చాలా తక్కువ ధరకే అమ్ముతున్నామని చెబుతారు. ఆసక్తి చూపిన వారికి తొలుత ఒరిజినల్‌వి చూపిస్తారు. ఆశపడిన వినియోగదారులు నగదు చెల్లించాక అప్పటికే రాళ్లు పెట్టి నీట్‌గా ప్యాక్‌ చేసిన కొత్త పాకెట్ వాళ్లకిచ్చి క్షణాల్లో అక్కడినుంచి ఉడాయిస్తారు. ఈ ఇద్దరూ పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పరిధిలో ముగ్గురిని మోసం చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు నేటి ఉదయం జరిపిన వాహనాల తనిఖీలో వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో, అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1 లక్షకు పైగా నగదు, స్కూటరు, ల్యాప్‌టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News