: మరింత సులభం కానున్న మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్
స్మార్ట్‌ఫోన్ల వాడకం శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ మాత్రం ఇంకా మందకొడిగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా అభిప్రాయపడింది. మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సరళీకరించాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది. అన్ని వివరాలనూ అందించిన ఖాతాదారులకు వీలైనంత త్వరగా మొబైల్ బ్యాంకింగ్ సేవలందించాలని సూచించింది. ఏటీఎంల వద్దే ఎం-పిన్ నంబర్‌ను మార్చుకునే వీలు కల్పించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఫోన్ బ్యాంకింగ్, మెయిల్స్, ఎస్‌ఎంఎస్, వెబ్‌సైట్, కియోస్క్‌లు, సోషల్ మీడియా సైట్ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడంతోపాటు రిజిస్ట్రేషన్‌కూ ఏర్పాట్లు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.