: చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అమలుపై సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆయన శుక్రవారం విశాఖలో మహాధర్నా పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏ ఒక్క మాటనూ చంద్రబాబు నిలుపుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు.