: నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవంలో ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ ప్రదర్శన
ఈ నెల 11న ఓస్లోలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవంలో సుప్రసిద్ధ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలీఖాన్ తో పాటు ఆయన కుమారులు అమన్, అయాన్ లు కూడా పాల్గొంటారని వివరించారు. పాకిస్తాన్ కు చెందిన ఖవ్వాలీ స్టార్ రహత్ ఫతే అలీఖాన్, అమెరికన్ సింగర్ స్టీవెన్ టైలర్ ల ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. ఈ దఫా ఇండియాకు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్ది, పాక్ కు చెందిన మలాలా నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకోనున్న సంగతి తెలిసిందే.