: సాధ్వి రాజీనామాపై పట్టువీడని విపక్షాలు... రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా


కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధ్వి తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్షాలు లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో కాస్త శాంతించినా, రాజ్యసభలో మాత్రం రాజీకి రాలేదు. నేడు సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనలతో ఓసారి సభ వాయిదా పడగా, దాదాపు గంట తర్వాత పున:ప్రారంభమైనా విపక్షాలు తమ పట్టు సడలించలేదు. దీంతో, సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్తూ రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News