: డ్రాగా ముగిసిన భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్
ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిని 243 పరుగులకే పరిమితం చేసిన భారత్, జవాబుగా 375 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (66), ఓపెనర్ విజయ్ (60), రహానే (56), వికెట్ కీపర్ సాహా (50), రోహిత్ శర్మ (48) బ్యాటింగ్ ప్రాక్టీసు చేసుకున్నారు. ఆసీస్ దేశవాళీ బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అనంతరం, రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు రెండోరోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్లకు 83 పరుగులు చేసింది.