: జనావాసాల మధ్య బ్రోతల్‌ మాఫియా... పోలీసుల అదుపులో నిర్వాహకులు


రేయింబగళ్లు ప్రజలు సంచరించే ప్రాంతంలో యువతులకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీలో జనావాసాల మధ్య జరుగుతున్న బ్రోతల్‌ మాఫియా గుట్టు రట్టయింది. ఈ తెల్లవారుజామున అర్థనగ్నంగా పరిగెడుతున్న ఓ మహిళను స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. తనకు మత్తు మందు ఇచ్చి గత కొంత కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆ మహిళ వాపోయింది. వ్యభిచారానికి ఒప్పుకోనందున, తీవ్రంగా హింసించారని పేర్కొంది. వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అనేక మంది యువతులకు ఇలాగే మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News