: జగన్ ధర్నాకు అర్థం లేదు: కేఈ


రుణమాఫీపై ప్రభుత్వం తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు అర్థం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అసలు ధర్నా ఎందుకు చేస్తున్నానన్న విషయంపై జగన్ కు కూడా స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ప్రకటించిన కేఈ, రుణమాఫీపై విధివిధానాలు ప్రకటించినా జగన్ ధర్నా చేయడంలో అర్థం లేదన్నారు. ఇదిలా ఉంటే, నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే భూమిని సేకరించే విషయంలో భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్)కే ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News