: హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఆటోలు


రహదారి భద్రతా బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆటో సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నగర వ్యాప్తంగా ఆటోలు బంద్ పాటిస్తున్నాయి. రేపు అర్థరాత్రి వరకు బంద్‌ కొనసాగనుంది. ఆటోల బందుతో ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. దూరప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్ తదితర చోట్ల దిగిన ప్రజలు గమ్యస్థానం చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, మరికాసేపట్లో సుందరయ్య పార్కు నుంచి ఆటో సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి.

  • Loading...

More Telugu News