: మంత్రాలయం రాఘవేంద్రుడికి బళ్లారి మైనింగ్ వ్యాపారి భారీ విరాళం!
బళ్లారిలో మైనింగ్ వ్యాపారిగా పేరుగాంచిన సూర్యనారాయణ రెడ్డి మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి భూరి విరాళాన్ని ప్రకటించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.90 లక్షలను ఆయన ప్రకటించారు. అంతేకాక రూ.6 కోట్లతో మంత్రాలయ మఠంలో శిలా మండపాన్ని నిర్మించేందుకు కూడా ఆయన అంగీకారం తెలిపారు.