: విజేతలకు గూగుల్ కళ్లజోడు కంప్యూటర్లు


కళ్లద్దాలలో కంప్యూటర్ లా ఒదిగి ఇంటర్నెట్ ప్రపంచాన్నంతటినీ రెండు కళ్ల ముందు ఆవిష్కరించే అద్భుత పరికరమే గూగుల్ గ్లాస్. గాడ్జెట్ ప్రపంచాన్ని శాసించే, భవిష్యత్ తరం టెక్నాలజీ స్మార్ట్ పరికరంగా దీనిని భావిస్తున్నారు. ఈ గూగుల్ గ్లాస్ 8 వేల మంది అమెరికన్ విజేతలకు త్వరలో అందనుంది. టెస్ట్ వెర్షన్ కింద వీటిని ఎంపిక చేసిన విజేతలకు గూగుల్ అందిస్తుంది. ఇందుకోసం విజేతలు ఒక్కొకరు 1500డాలర్లు(మన రూపాయలలో అయితే సుమారు 80వేలు) చెల్లించాలి. దీనిని వారు ఎవరికీ విక్రయించకూడదు, కనీసం చూడ్డానికి కూడా ఇవ్వకూడదు... వంటి షరతులు వర్తిస్తాయి. ఈ కళ్లద్దాలను వారికివ్వడం ద్వారా గూగుల్ అభిప్రాయాలను సేకరిస్తుంది. అనంతరం అందులో మార్పులు చేర్పులు చేశాక ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది.

మరోవైపు గూగూల్ దెబ్బ నుంచి తట్టుకుని నిలబడేందుకు, మార్కెట్ వాటా కాపాడుకునేందుకు యాపిల్, శాంసంగ్ తదితర కంపెనీలు కూడా కళ్లకు ధరించగలిగిన కంప్యూటర్ల తయారీపై పరిశోధన చేస్తున్నాయని సమాచారం. ఎందుకంటే గూగుల్ గ్లాస్ సక్సెస్ అయితే మిగతా పరికరాలన్నీ అటకెక్కాల్సిందేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News