: బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు... కొనసాగుతున్న కాల్పులు


పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు మరోసారి పాడుబడిన బంకర్ ను తమ స్థావరంగా ఎంచుకున్నారు. ఈసారి భారీగా ఆయుధాలతో వచ్చారు. నేటి ఉదయం బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్‌లోకి ఉగ్రవాదులు చొరబడగా, వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎంతమంది ఉన్నారు? అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు. ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఇద్దరు పోలీసులు చనిపోయారని, సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమై ఉండొచ్చని వివరించారు. ఉగ్రవాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ సైన్యంపై తుపాకి కాల్పులు కొనసాగిస్తున్నారని, సాధ్యమైనంత త్వరగా ఎన్ కౌంటర్ పూర్తి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News