: పోప్ ఫ్రాన్సిస్ జీవితకథ ఆధారంగా సినిమా


ప్రముఖుల జీవిత కథలు ఇతివృత్తంగా సినిమాలు నిర్మించడం ఎప్పటినుంచో ఉన్నదే. తాజాగా, క్యాథలిక్కుల విశ్వగురువు పోప్ ఫ్రాన్సిస్ జీవితకథ ఆధారంగా హాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఎలిజబెటా పిక్ రాసిన 'పోప్ ఫ్రాన్సిస్: లైఫ్ అండ్ రెవల్యూషన్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్కెటింగ్ ను నిర్వహిస్తున్న ఫిలింషార్క్స్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది. పోప్ పాత్రను డారియో గ్రాండినెటి పోషిస్తారు. 'వైల్డ్ టేల్స్' చిత్రంతో గ్రాండినెటి పేరు తెచ్చుకున్నారు. ఈ బయోపిక్ ను పాబ్లో బాసి నిర్మిస్తుండగా, బెడా డొకాంపో ఫీజూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం పోప్ ను కలిసి, ప్రాజెక్టుపై చర్చించారు.

  • Loading...

More Telugu News