: జగన్ కు 25 ప్రశ్నలు సంధించిన మంత్రి గంటా


వైకాపా అధినేత జగన్ కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు 25 ప్రశ్నలను సంధించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ టీడీపీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసిందని... ఇంకెందుకు మీరు ధర్నా చేస్తున్నారని గంటా ప్రశ్నించారు. వైకాపా నుంచి ఒక్కో నేత బయటకు వస్తున్నందున... ఉనికిని కాపాడుకోవడానికే జగన్ ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తోందని... అవేవీ జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇంకా జగన్ గుణపాఠం నేర్చుకోలేదా? అని నిలదీశారు. అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.

  • Loading...

More Telugu News