: స్మితా సబర్వాల్ కు సమన్లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ, ఇటీవలే నల్గొండ జిల్లాకు కలెక్టర్ గా బదలీ అయిన స్మితాదాస్ సబర్వాల్ కు చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రదీప్‌కుమార్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో గాయిత్రీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం 38 మంది చేత వెట్టిచాకిరీ చేయిస్తుండడాన్ని గుర్తించి, చర్యలు తీసుకున్నారు. గాయిత్రీ స్టోన్ క్రషర్స్ యజమాన్యం క్రష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది. కాగా 2009 నుంచి స్మిత కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, నల్గొండ జిల్లాకు బదిలీ అయిన ఆమెను ఇంకా రిలీవ్ చెయకపోవడంతోముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆమె విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.