: జీహెచ్ఎంసీ విషయంలో టీఎస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్'


జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసిన నేపథ్యంలో, ఎన్నికలు జరిపించకుండా పాలన విషయాలను ప్రత్యేక అధికారికి అప్పగించిన టీఎస్ ప్రభుత్వ వైఖరిని 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' తప్పుబట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-యు ప్రకారం కాలపరిమితి ముగిసే లోపలే ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. దీన్ని ఉల్లంఘించిన టీఎస్ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించింది. ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఎన్నికలను వాయిదా వేయాలని... ప్రస్తుతం హైదరాబాదులో ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్నా ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని అభిప్రాయపడింది. ఈ విషయంపై తాము కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News