: నాసా ఓరియన్ ప్రయోగంలో అవాంతరం ... నేటికి వాయిదా


అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా రూపొందించిన ఓరియన్ అంతరిక్ష నౌక ప్రయోగంలో అవాంతరాలు ఏర్పడ్డాయి. గురువారం ప్రయోగం సందర్భంగా బలమైన ఈదురు గాలులతో పాటు నౌకలోని ఇంధన మార్గాల్లో ఏర్పడ్డ అంతరాయాల వల్ల ఓరియన్ ప్రయోగం ఆలస్యమవుతుందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. అయితే నేడు మరోమారు ఓరియన్ ను అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. బలమైన ఈదురు గాలులతో రెండు సార్లు కౌంట్ డౌన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాకెట్ కు ఇంధనాన్ని సరఫరా చేసే పైపులో లోపం తలెత్తింది. బ్యాటరీ కూడా పాడైంది. అయితే నౌకకు పెద్దగా నష్టమేమీ వాటిల్లలేదని నాసా వెల్లడించింది. మరి నేడు జరగనున్న ప్రయోగమైనా సఫలమవుతుందో, లేదోనన్న అనుమానాలను నాసాను పట్టిపీడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News