: సుష్మా స్వరాజ్... ట్విట్టర్ వినియోగిస్తున్న విదేశాంగ మంత్రుల్లో అగ్రగణ్యులు!


భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను అనుసరిస్తున్న ప్రపంచ దేశాల విదేశాంగ మంత్రులందరిలోకి అగ్రస్థానంలో నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోయర్లను కలిగిన విదేశాంగ మంత్రిగా ఆమె ఘనత వహించారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఆమె ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య 17,37,804కు చేరింది. ఇక ఈ విషయంలో రెండో స్థానంలో కొనసాగుతున్న యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి జాయేద్, సుష్మా కంటే చాలా వెనుకబడ్డారు. ఆయన ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య 13.80 లక్షలు మాత్రమే. ఇక ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోయర్లను కలిగిన ప్రపంచ స్థాయి నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఖాతాలో 83.90 లక్షల మంది ఫాలోయర్లున్నారు. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ప్రాన్సిస్ లున్నారు.

  • Loading...

More Telugu News