: ప్రియురాలి గొంతు కోసి పారిపోబోయి దొరికిపోయాడు


హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఇంజనీరింగ్ చదువుతున్న దినేష్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతు కోశాడు. దీంతో అమె రక్తపు మడుగులో కుప్పకూలింది. గొంతు కోసి పరారవుతున్న దినేష్ ను చూసిన స్థానికులు స్పందించి పట్టుకున్నారు. అమ్మాయి గొంతు కోయడంతో అతడికి బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో నిందితుడు దినేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News