: కోటి వేతనం ఉద్యోగాల్ని తిరస్కరించిన ఐఐటీ విద్యార్థులు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కోటి రూపాయల వేతనం ఇస్తామన్న కంపెనీలను ఐఐటీ విద్యార్థులు తిరస్కరించారు. కాన్పూర్ ఐఐటీలోని నలుగురు విద్యార్థులకు విదేశీ కంపెనీలు కోటి రూపాయల వేతనాన్ని ఇస్తామని, తమ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలని కోరాయి. అయితే వారు మాత్రం ఆయా కంపెనీల కోరికను తిరస్కరించారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఉన్నత చదువుల కోసం ఉద్యోగాలను వదులుకోగా, మరో అబ్బాయి, ఓ అమ్మాయి మాత్రం ఆ ఉద్యోగాలు తమకు సరిపడే ఉద్యోగాలు కావని, కోటి రూపాయల వేతనం వచ్చిన ఉద్యోగాలను వదులుకుని, ఏడాదికి 50 లక్షల రూపాయలు వేతనం వచ్చే ఉద్యోగాల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఐఐటీ కాన్పూర్ లో డిసెంబర్ 1 నుంచి 24 వరకు ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి.