: కల్యాణ్ లేనప్పుడు సెలబ్రేషన్ కు అర్థం ఉండదు: రేణూదేశాయ్
కల్యాణ్ లేనప్పుడు పుట్టిన రోజు పండగ అనేది అర్ధం లేనిదని రేణూదేశాయ్ స్పష్టం చేసింది. పుట్టిన రోజు సందర్భంగా వ్యక్తిగత విషయాలు చెప్పిన రేణూదేశాయ్ తనకు పుట్టిన రోజు చేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పింది. జీవితంలో ప్రధాన భాగమయిన కల్యాణ్ లేనప్పుడు పండగలు జరిగినా వాటిల్లో ఆయన లోటు కనిపిస్తుందని, దానిని తాను భరించలేనని రేణూదేశాయ్ తెలిపింది. అందుకే పిల్లల పుట్టిన రోజులు కూడా పెద్దగా చేయనని, కేవలం ఆత్మీయుల సమక్షంలో చిన్న గెట్ టు గెదర్ లాగా చేసుకుంటామని రేణూదేశాయ్ తెలిపింది. అయితే గతంలో కల్యాణ్ తో తనకు మంచి అనుభవాలు ఉన్నాయని, ఆయన చాలా బాగా చేశారని వివరించింది.