: నా ప్రేమ గుడ్డిదే కాదు, మూగది, చెవిటిది కూడా: రేణూదేశాయ్
18 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని రేణూదేశాయ్ తెలిపింది. అప్పటికి కళ్యాణ్ కి పెళ్లైందని తనకు తెలియదని రేణూదేశాయ్ చెప్పింది. పెళ్లి నాటికి కళ్యాణ్ తనకు పెళ్లయినట్టు, విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నట్టు చెప్పారని, అయితే విడాకుల కేసు ఆరునెలల్లోనే తేలిపోతుందని కూడా చెప్పారని రేణూ వెల్లడించింది. అయితే ఆ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగిందని రేణూ వివరించింది. తమ పెళ్లి అని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ వద్దని, ఆలోచించాలని సూచించారని చెప్పింది. అయితే నిండా ప్రేమలో ఉన్న తాను గుడ్డిగా, చెవిటిదాన్లా, మూగగా, పూర్తిగా వికలాంగురాల్లా అయిపోయానని నవ్వేసింది. అయితే తనకు అర్ధం కాని విషయం ఏంటంటే... నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ లేదు అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం, ఒకసారి ప్రేమించకపోవడం ఉంటుందా? అని అడిగింది.