: రెండు సంతకాలు పెడితే విడాకులు అయిపోతుందా? విలువలు, నమ్మకాలు ఉండవా?: రేణూదేశాయ్
ఇద్దరు వ్యక్తులు రెండు సంతకాలు పెడితే విడాకులు అయిపోతుందా? అని రేణూదేశాయ్ ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు సప్తపదులు, హోమ గుండాలు, వేద మంత్రాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు పెళ్లి ద్వారా కలవాలంటే నిర్వహించే క్రతువు లాంటిదే విడాకులకు కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు. పెళ్లి ద్వారా ఒక్కటైన మనసులు, తనువులు ఎలా విడిపోతాయని ఆమె ప్రశ్నించారు. ఇలా సంతకాలతో విడాకులు జరిగిపోతే విలువలు, నమ్మకాలకు విలువేముందని ఆమె అడిగారు. ఈ విషయంలో విలువలు, నమ్మకాలు తప్పుడువైతే చట్టం కరెక్టని... చట్టం తప్పైతే విలువలు, నమ్మకాలు నిజమైనవని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ఉద్విగ్నతకు లోనయ్యారు.