: 'తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రానికి ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు విద్యాశాఖ మంత్రి ఛైర్మన్ గా, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని ఇంతకుముందు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.