: పవన్... రేణూలలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు?


తమ ప్రేమ కథ చాలా అందమైనదని రేణూదేశాయ్ చెప్పింది. తనకు 18 ఏళ్ల వయసప్పుడు తొలిసారి 'బద్రి' సినిమా షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చానని, తరువాత పవన్ కల్యాణ్ ను తొలి చూపులోనే ప్రేమించానని రేణూ తెలిపింది. అయితే తమ ఇద్దరిలో ప్రపోజ్ చేసింది మాత్రం కల్యాణేనని వెల్లడించింది. 19 ఏళ్ల వయసులో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే పెళ్లి చేసుకున్నామని రేణూ స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం చాలా అందంగా గడిచిందని తెలిపింది. పెళ్లి అంటే ప్రతిరోజూ అడ్వెంచర్ లా గడవాలని అభిప్రాయపడింది. అంతే కానీ రోజూ చూసే మొగుడే కదా అనేలా ఉండకూడదని రేణూ తెలిపింది. అలా అయితే జీవితం నిస్సారమైపోతుందని రేణూ వివరించింది. తన ప్రేమ, పెళ్లి అన్నీ ఫెయిరీ టేల్ లా జరిగాయని రేణూ దేశాయ్ చెప్పింది.

  • Loading...

More Telugu News