: అవును... కల్యాణ్ నన్ను అలానే పిలుస్తారు: రేణూదేశాయ్
తనకు పవన్ కల్యాణ్ తో పరిచయమయ్యేటప్పటికి కేవలం 19 ఏళ్లేనని, ప్రపంచం ఎలా ఉంటుందో కూడా సరిగా తెలియని వయసని రేణూదేశాయ్ తెలిపింది. అందుకే పవన్ కల్యాణ్ తనను 'సుబ్బమ్మ' అని పిలిచేవారని రేణూదేశాయ్ వెల్లడించింది. అది కాల క్రమంలో 'సుబ్స్' అయిందని, ఇప్పుడది నెమ్మదిగా 'సు' అయిందని రేణూ తెలిపింది. కల్యాణ్ 'రేణూ' అని పిలుస్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఏదో పనిలో నిమగ్నమైపోయేదాన్నని, 'సు' అని పిలవగానే 'ఏంటీ?' అంటూ ఈ లోకంలోకి వచ్చేదాన్నని రేణూ తెలిపింది. మారిషస్ లో ఎవరో 'సు' అని పిలిస్తే, తననే అనుకునే భ్రమలో ఒక్కసారి అవాక్కైపోయానని, తరువాత ఎవరో ఎవర్నో పిలుస్తున్నారని తెలుసుకుని కుదుటపడ్డానని తెలిపింది.