: విశాఖలో ముగిసిన ప్రపంచ బ్యాంకు పర్యటన
'హుదూద్' నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన ముగిసింది. విశాఖపట్టణంలో తుపాను తీరం దాటిన ప్రాంతాన్ని, తుపాను తీవ్రతకు దెబ్బతిన్న పలు ప్రాంతాలను ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది. అనంతరం విశాఖ నుంచి హైదరాబాదు బయల్దేరింది. అంతకు ముందు విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.