: పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తొలిసారి తన వ్యక్తిగత జీవితం గురించిన పలు విషయాలను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ వీడియోను యూట్యూబ్ లో అభిమానులు, ప్రేక్షకులతో పంచుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి కావడం తనకు చాలా ఆనందంగా ఉందని, వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. పవన్ కల్యాణ్ నుంచి వేరుగా ఉంటున్నప్పటికీ తన వివాహ జీవితం ఇప్పటికీ ఆనందంగానే ఉందని తెలిపింది. పవన్ నుంచి విడిపోయి వెళ్లినప్పుడు తనపై వచ్చిన రూమర్లపై చాలా బాధపడ్డానని ఇదే సందర్భంగా రేణు వెల్లడించింది. ఇలా పవన్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని విషయాలను ఇంటర్వ్యూలో వివరించింది.