: లోక్‌సభలో ప్రధాని వివరణకు కాంగ్రెస్ డిమాండ్
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో వివరణ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని లోక్ సభలో వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. అంతకుముందు సభాపతి మాట్లాడుతూ, సాధ్వి ఇప్పటికే క్షమాపణ చెప్పారని, అది పరిగణనలోకి తీసుకుని సమావేశం కొనసాగించాలని కోరారు. దీనికి అంగీకరించని విపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలన్న తమ అభిప్రాయం మారదని ఈ సందర్భంగా ఖర్గే స్పష్టం చేశారు.