: నావికాదళ సిబ్బంది త్యాగాలను స్మరించుకున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్లో స్పందించారు. నావికాదళ సిబ్బంది త్యాగాలను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. "మాతృభూమిని కాపాడే క్రమంలో, వారు కనబరిచే స్ఫూర్తి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. నేవీ... భారత్ కు ఆస్తి వంటిదని, దాన్ని దేనితోనూ పోల్చలేమని అభిప్రాయపడ్డారు. అటు, నేడు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జయంతి కూడా కావడంతో, మోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజ్రాల్ తన వ్యక్తిత్వంతో పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.