: ఇంటర్ పరీక్షలు సొంతంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశాలు
ఇంటర్ పరీక్షలు సొంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సమయంలో పైవిధంగా ఆదేశాలిచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇంటర్ పరీక్షలు సొంతంగా నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. మరోవైపు, ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే.