: ఏపీలో 13న వామపక్షాల ధర్నా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదని ఆరోపిస్తూ ఈనెల 13న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు తెలిపాయి. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మీడియాతో మాట్లాడారు. ఈనెల 19న అనంతపురం జిల్లా కరవు ప్రాంతాల్లో, ఆపై 23న హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని వారు తెలిపారు. రాజధాని పరిసరాల్లో ప్రభుత్వమే కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తోందని, అందువల్లే ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని వారు ఆరోపించారు.