: ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్టు


పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాకు బస్సులు కేటాయించడం లేదంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. తమ పార్టీపై వివక్షతోనే బస్సులు కేటాయించడం లేదని కొత్తపల్లి ఆరోపించారు. బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బస్సులు వేసిన ఆర్టీసీ, ఇప్పుడు ధర్నాకు మాత్రం కేటాయించడం లేదన్నారు. ధర్నా విజయవంతం కారాదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఈ సమయంలోనే సుబ్బారాయుడుని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News