: ఆ ఐదుగురికి మొండిచేయి... వరల్డ్ కప్ కు టీమిండియా ప్రాబబుల్స్ ఎంపిక


సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో తమకు చోటు దక్కుతుందని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లకు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ముంబయిలో ఈ రోజు సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ 30 మందితో వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జాబితాను ఖరారు చేసింది. సందీప్ పాటిల్ నేతృత్వంలో సుదీర్ఘంగా చర్చించిన సెలక్షన్ ప్యానల్ యువతకు పెద్దపీట వేసింది. భేటీ అనంతరం జాబితాను మీడియాకు విడుదల చేశారు. కాగా, ఈ ప్రాబబుల్స్ ను కుదించి తుది జట్టును ఎంపిక చేస్తారు. ప్రాబబుల్స్ వివరాలు... ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రాబిన్ ఊతప్ప, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, మనీశ్ పాండే, వృద్ధిమాన్ సాహా, సంజు శాంసన్, ఆర్.అశ్విన్, పర్వేజ్ రసూల్, కర్ణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్, ధవళ్ కుల్ కర్ణి, స్టూవర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, అశోక్ దిండా, కుల్దీప్ యాదవ్, మురళీ విజయ్.

  • Loading...

More Telugu News