: హ్యూస్ కోసం ఆసీస్ ఈ సిరీస్ లో తీవ్రంగా పోరాడతారు: అక్రమ్


భారత్ తో టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియన్లు తీవ్రంగా పోరాడడం ఖాయమని అంటున్నాడు పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్. హ్యూస్ కోసం సిరీస్ గెలవాలని భావిస్తారని, దీంతో, భారత్ కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. ప్రస్తుత ఆసీస్ టీం బలంగా కనిపిస్తోందని, వారితో పోరు టీమిండియాకు సవాలేనని అన్నాడు. ఈ సవాల్ కు భారత్ సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఇక, హ్యూస్ గాయాన్ని 'చిత్రమైన ఘటన' అని పేర్కొన్నాడు. ప్రాణాంతక బౌన్సర్ విసిరిన షాన్ అబాట్ కు అక్రమ్ సంఘీభావం ప్రకటించాడు. అతని తప్పేమీ లేదని అన్నాడు. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News