: ములాయం నేతృత్వంలో 'జనతా పరివార్'... మోదీని ఎదుర్కొనేందుకే!


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండటంతో విపక్ష పార్టీలను ఏకతాటిపై నడిపించేందుకు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో 'జనతా పరివార్'ను ఆరంభించినట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. ములాయం విపక్ష పార్టీల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తారని తెలిపారు. ఇప్పటికే విడివిడిగా ఉన్న పార్టీలను కలిపి, మోదీ అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కోవాలని నిశ్చయించినట్టు ఆయన తెలిపారు. 'జనతా పరివార్' ఏర్పాటుకు పలు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు నితీష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News