: మోదీని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా... కాశ్మీర్ వ్యాలీలో భారీ భద్రత


ఈ నెల 8న కాశ్మీర్ వ్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని భద్రతా ఏజెన్సీల సమాచారం. లష్కరే తోయిబాకు చెందిన నలుగురి నుంచి ఐదుగురు ఆత్మాహుతిదళ సభ్యులు వ్యాలీలో మోదీపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. షెడ్యూల్ ప్రకారం వ్యాలీలోని శ్రీనగర్, అనంతనాగ్ పట్టణాల్లో పార్టీ అభ్యర్థుల తరపున పీఎం ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రాంతాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సయద్ అలీ షా గీలానీ బంద్ కు పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News