: నల్లగొండ జిల్లాలో మావోల సంచారం లేదు: హైదరాబాద్ రేంజ్ ఐజీ గంగాధర్


తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఎంతమాత్రం లేదని హైదరాబాద్ రేంజ్ ఐజీ గంగాధర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిస్తూ చౌటుప్పల్ శివారులో మావోయిస్టుల పేరిట గురువారం పోస్టర్లు వెలిశాయి. దీంతో రంగంలోకి దిగిన గంగాధర్ మావోల కదలికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. మావోల పేరిట వెలసిన పోస్టర్లపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మావోల కదలికలే లేకుంటే పోస్టర్లు ఎలా వెలుస్తాయంటూ ప్రశ్నించిన ఆయన పోస్టర్లను అంటించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News