: తెలుగమ్మాయిని పెళ్లాడిన బ్రిటీష్ ఎంపీ అత్తారింటికి వచ్చాడు!


తెలుగమ్మాయి ప్రశాంతిరెడ్డిని బ్రిటీష్ ఎంపీ డాన్ బైల్స్ పెళ్లాడడం తెలిసిందే. మనసులు కలిసిన అనంతరం, కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుని, క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. 2007 జూన్ 22న బైల్స్, ప్రశాంతి వివాహం జరిగింది. బైల్స్ బ్రిటీష్ జాతీయుడు కాగా, ప్రశాంతి స్వస్థలం వరంగల్. వీరికి ఇద్దరు పిల్లలు. కన్జర్వేటివ్ పార్టీ తరపున 2010లో ఎంపీగా ఎన్నికయ్యాడు బైల్స్. ఇతడికి తెలుగు సంప్రదాయాలంటే అమిత గౌరవం. అంతా భార్య మహత్మ్యం కావచ్చు. కాగా, బైల్స్ కొన్నిరోజుల క్రితం అత్తారిల్లైన వరంగల్ వచ్చాడు. భార్య ప్రశాంతితో కలిసి చారిత్రక స్థలాలను దర్శిస్తూ మీడియాకు చిక్కాడు. స్థానిక దేవాలయాల్లో పూజాదికాల సందర్భంగా, ఆచార వ్యవహారాలను ఆసక్తిగా పరికించాడీ బ్రిటిషర్. అంతేగాదు, శ్రద్ధగా పాటించాడు కూడా. తనకు తెలుగు సంస్కృతి అంటే ఇష్టమని ఈ సందర్భంగా తెలిపాడు. పనిలోపనిగా, కేసీఆర్ పాలన భేష్ అంటూ ఓ ఉచిత సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. అన్నట్టు... ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి రచించిన 'ప్యాసా' అనే పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదలైంది. ఓ తెలుగువాడు రాసిన పుస్తకం ఖండాంతరాలు దాటి విడుదల కావడానికి తెలుగువారి అల్లుడు డాన్ బైల్సే కారణం.

  • Loading...

More Telugu News