: కొత్త రాజధాని రియల్ మాఫియా... సీపీఎం కార్యకర్తలపై దాడి


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాంతంలో రియల్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలం దేవరంపాడులో ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో సీపీఎం నేతలు, రైతుల మధ్య భూవివాదం తీవ్ర సంచలనం రేపింది. సీపీఎం నేతలు, రైతుల మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రస్థాయికి చేరగా, కొందరు వ్యక్తులు మారణాయుధాలతో సీపీఎం కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. రాజుపాలెం మండల సీపీఎం కార్యదర్శి ఆంజనేయులు నాయక్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే దాడులు చేసింది తాము కాదని రైతులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News