: మావోల ఆయుధాలు అమ్మకానికి... పోలీసులే కొనుగోలుదార్లు!


పోలీసు బలగాలు కూంబింగ్ కు వెళ్లినప్పుడు మావోయిస్టులతో కాల్పులు జరుగుతుంటాయి. ఆ సందర్భంగా, పోలీసులు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారు. మావోయిస్టు డంప్ లు బయటపడ్డప్పుడు కూడా వాటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యం అవుతుంటాయి. వాటన్నింటినీ ప్రభుత్వపరం చేస్తారు. కొంతకాలంగా, ఆ ఆయుధాలను అమ్మకానికి పెడుతున్నారు. ఆ ఆయుధాలు కావాలంటూ పోలీసులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుండడంతో ఈ ప్రత్యేక అమ్మకం జరపాలని నిర్ణయించారట. మార్కెట్ రేట్ కంటే తక్కువకే వస్తుండడంతో పోలీసు అధికారులు వీటి కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు, ఐపీఎస్ అధికారులైన టి.కృష్ణరాజు, కృపానంద్ త్రిపాఠి ఉజేలా, కమలాసన్ రెడ్డిలకు అనుమతి మంజూరైందట.

  • Loading...

More Telugu News