: వారిలా నోటికొచ్చినట్లు మాట్లాడను: అమిత్ షాపై దీదీ విమర్శనాస్త్రాలు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆధారాలుంటేనే తాను మాట్లాడతానని ప్రకటించిన దీదీ, కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారని వ్యాఖ్యానించారు. శారదా చిట్ ఫండ్ నిధులను పశ్చిమ బెంగాల్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమిత్ షా మొన్నటి కోల్ కతా ర్యాలీ సందర్భంగా ఆరోపించారు. అమిత్ షా ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం కేంద్రం పార్లమెంట్ కు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యల్లో పస లేదని ఆయన పార్టీ ప్రభుత్వమే చెప్పిన తర్వాత దీదీ ఊరుకుంటారా? అందుకే, వెనువెంటనే స్పందించిన మమత, ‘‘కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. నేను మాత్రం ఆధారాలు లేనిదే మాట్లాడను’’ అంటూ అమిత్ షాను దెప్పి పొడిచారు.

  • Loading...

More Telugu News